Thursday 24 May 2012

టెన్త్ ఫలితాల విడుదల


               
పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
మంత్రి పార్థసారథి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎస్‌ఎస్‌సి బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు. 
 మొదటి సారిగా పదవతరగతిలో మార్కుల విధానానికి స్వస్తి చెప్పి గ్రేడ్ల విధానంలో ఫలితాలు వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా12 లక్షల 50వేల మంది విద్యార్థులు హాజరు కాగా
    రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా  93.38 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా, 76.94  శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్  జిల్లా చివరి స్థానంలో నిలిచింది.  
     రీవాల్యూషన్‌కు దరఖాస్తు చేసేందుకు ఆయా జిల్లాల డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.
     జూన్ 20 నుంచి జూలై 3 వరకూ పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది.
                      పరీక్ష రుసుము జూన్ 11వ తేదీ లోగా చెల్లించాలని తెలిపింది.