సెప్టెంబరు 1న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్) ను వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్ట విభజన నేపథ్యంలో కొనసాగుతున్న ఆందోళనల్లో టెట్ పరీక్ష నిర్వహించే పరిస్థితి కన్పించడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని డీఈవోలు పంపిన నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు టెట్ కన్వీనర్ జగన్నాథ రావు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించడానికి వీలుకాదనే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.